గిగ్ కార్మికులు దేశవ్యాప్తంగా బంద్ చేపట్టడంతో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి క్విక్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల సేవలు నిలిచిపోయాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేళల్లో కూడా ఈ సేవలు నిలచిపోనున్నట్లు తెలిపారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్ట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ పిలుపునిచ్చిన ఈ బంద్‌లో భాగంగా డెలివరీ బాయ్స్ తమ వేతనాలు, భద్రత, గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa