మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామ సర్పంచ్ పార్నంది కిషన్, వార్డు సభ్యులు తాళ్ల వెంకటేశ్, నెలవేణి సుశీల, కోమల్ల నరేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్ఎండీలోని ప్రజాభవన్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పచ్చునూరు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, గ్రామ అవసరాల మేరకు చేపట్టే అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయిస్తానని, గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa