పంజాగుట్ట పోలీసులు రూ.కోటి క్రిప్టో కరెన్సీ దోపిడీ కేసులో హైమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇండియన్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీ ఇస్తామంటూ మోహిదీపట్నానికి చెందిన వ్యాపారవేత్తను ఓ ముఠా మోసం చేసింది. రూ.కోటి విలువైన క్రిప్టో కరెన్సీ ఇస్తామని ఓ హోటల్‌కు నిందితులు పిలిచి, నగదు తీసుకుని క్రిప్టో ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ చేయడంతో వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa