వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌లోని మార్వాడీ ధర్మశాల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ పూజారి సునీల్ శర్మ, ఈఓ రమేష్‌లు కలెక్టర్‌కు స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో అర్చన చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సీనియర్ అసిస్టెంట్ రమణ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa