బీజేపీకి మరికొద్ది రోజుల్లో కొత్త సారథి రానున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. జనవరి 19న నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఆ మరుసటి రోజు జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది. బీజేపీ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2-4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చని, ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa