కాచిగూడ – రేపల్లె వెళ్లే డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు రెండు స్లీపర్ కోచ్‌లలోని ప్రయాణికులను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా థర్డ్ ఏసీ బోగీల్లోకి అప్‌గ్రేడ్ చేశారు. గతంలో ఐసీఎఫ్ కోచ్‌లున్న ఈ రైలును ఇటీవల ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చారు. ఈ మార్పుల వల్ల స్లీపర్ కోచ్‌ల సంఖ్య తగ్గి, థర్డ్ ఏసీ కోచ్‌లు పెరిగాయి. దీంతో ముందుగా స్లీపర్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సమస్య ఏర్పడటంతో, వారిని థర్డ్ ఏసీలోకి అనుమతించారు. తద్వారా కొందరు తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa