ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 11:09 AM

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్ - 3 మెయిన్ పైప్‌లైన్‌లో  భారీ లీకేజీని అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. దీనితో పాటు, టిఎస్ ట్రాన్స్‌కో  ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు.ఈ పనులు ఈరోజు రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. కావున ఈ 12 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.కావున కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. 


అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:1. డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.
2. డివిజన్–9: కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.
3. డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.
4. డివిజన్–17: గోపాల్ నగర్.5. డివిజన్–22: తెల్లాపూర్.కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa