విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ జి. రమేష్ వివరాలు వెల్లడించారు. నిందితుడు ఇప్పటి వరకు 8 మంది నుంచి రూ. 85 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. అతని నుంచి మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మాడ్గులపల్లి, వరంగల్ పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa