TG: నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో మూడేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. నిర్మల్‌లో నివాసముంటున్న అనిల్, చంద్రిక దంపతులకు అశ్విన్(3), ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. అయితే ఈ నెల 10న అశ్విన్ తన ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా బాలుడు ఇంటికి సమీపంలోని ఓ మురికి కాలువలో చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. బాబు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa