మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలంలోని వాడి గ్రామంలో ఈ నెల 30వ తేదీన శుక్రవారం శ్రీశ్రీశ్రీ పార్వతి సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయ దశమ వార్షికోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మాదేవేందర్ రెడ్డిని హైదరాబాద్ కొంపల్లిలోని ఆమె నివాసంలో సోమవారం కలిసి ఆహ్వాన శుభపత్రికను అందజేశారు. వార్షికోత్సవానికి విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్త బృందం సభ్యులు మల్లయ్య, నర్సింలు, రాజులు, మహేందర్, దుర్గయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa