తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో 19-01-2026 ఉదయం 11 గంటలకు ఆఫీస్ ప్రాంగణంలో ప్రజాకవి వేమన 659వ జయంతి సందర్భంగా “వేమన పద్యాలకు నీరాజనం” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, వేమన బ్రాహ్మణేతరుడిగా ప్రజల భాషలో వేలాది పద్యాలు రచించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ దృక్పథంతో ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. వేమనపై జరిగిన వక్రీకరణలు బూటకమని, ఆయన గొప్ప మహాకవి అని అన్నారు. అనంతరం పలువురు వేమన పద్యాలను గానం చేసి, అర్థాలు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa