ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేగంపేట ఫ్లైఓవర్ పై ప్రమాదం, నలుగురికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 02:03 PM

ఫ్లైఓవర్ పై వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తాపడింది. హైదరాబాద్ లోని బేగంపేట ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు స్పందించి అందులోని ప్రయాణికులను బయటకు తీశారు.గాయాలపాలైన వారిని ట్రాఫిక్ పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బేగంపేటలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బోల్తాపడ్డ కారును స్థానికుల సాయంతో పోలీసులు పక్కకు జరిపించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa