ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గండికోటలోని లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయ విశిష్టత ఇదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 03:40 PM

వైఎస్సార్ కడప జిల్లా గండికోట దుర్గంలోని లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. నవాబుల దాడుల సమయంలో స్వామివారు గర్భగుడి వెనుక సొరంగ మార్గం ద్వారా మైదుకూరులోని మాండవ్య క్షేత్రానికి చేరుకున్నారని భక్తుల విశ్వాసం. అక్కడ ఒక బావి వద్ద అజ్ఞాతంగా వెలసి, రోజూ ఒక మేక ద్వారా పాలు స్వీకరించేవారని, ఒకరోజు గొర్రెల కాపరి మేక తలపై కొట్టగా స్వామి నుదిటిపై గాయం ఏర్పడిందని, ఆ గాయం మచ్చ నేటికీ ఉందని కథనం. భక్తులు స్వామిని గుర్తించి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa