TG: క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్(SMR) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక-2026 సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2047 నాటికి నెట్-జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa