ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమహల్ పునరుద్ధరణకు రూ.23 కోట్లు మంజూరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 04:40 PM

వనపర్తిలోని 140 ఏళ్ల నాటి రాజగారి బంగ్లా (రాజమహల్) పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.23.15 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల వసతి గృహాల పునరుద్ధరణకు రూ.13.15 కోట్లు, రాజమహల్ పునరుద్ధరణకు రూ.10 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల జీవో జారీ అయింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన నాయుడు ఎమ్మెల్యే మేఘారెడ్డికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa