TG: మహిళలకు ఆర్ధిక చేయూత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో కూడా తొలి దశలో 40 - 50 సంఘాలకు బస్సులు ఇస్తామని అన్నారు. మరో 19 రోజుల్లో మహానగర పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి GHMC ప్రధాన కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa