ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు భరోసా.. ఖాతాల్లోకి రూ.6 వేలు వచ్చేది ఆ రోజే!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 12:25 PM

తెలంగాణలో యాసంగి పెట్టుబడి సాయం(రూ.6000) కోసం ఎదురుచూస్తున్న రైతులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. అయితే సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కసరత్తులే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. శాటిలైట్ సర్వే రిపోర్టులు ఇంకా పూర్తి కాలేదు. సర్వే నివేదికలు వచ్చిన తర్వాతే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa