బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం సుంకిడి గ్రామ ఉప సర్పంచ్ అజయ్ జాదవ్, గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ కార్యకర్తలు సహనం కోల్పోవద్దని, కాంగ్రెస్ పెట్టే ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో రాష్ట్రాన్ని సాధించిందని, రానున్న రోజుల్లో అధికారం బీఆర్ఎస్ దేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa