ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం సేకరణతో 14.2 లక్షల మంది రైతులకు లబ్ధి: మంత్రి ఉత్తమ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 03:39 PM

TG: రాష్ట్రంలో ధాన్యం సేకరణను విజయవంతం చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 2025-26 ఖరీఫ్‌ సీజన్ ధాన్యం సేకరణపై గురువారం పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణతో 14.2 లక్షల మంది రైతులు లబ్ధిపొందారని చెప్పారు. రూ.18,444 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa