ఇటీవల జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాల్లో నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదని తెలంగాణ విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో నార్మలైజేషన్ ఉంటుందన్న ప్రచారం జరిగినా, అధికారులు తాజా నిర్ణయంతో ఆ గందరగోళానికి తెరదించారు. జిల్లాకు ఒకే సెషన్ చొప్పున పరీక్ష నిర్వహించడంతో నార్మలైజేషన్ అవసరం లేదని, కొత్తగా ఈ విధానాన్ని తెస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావిస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించారు. ఈ నెల 30న టెట్ ప్రిలిమినరీ 'కీ'ని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa