ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె.. ఛార్జీల పెంపునకు డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 11:25 AM

దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు శనివారం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు సమ్మె చేపట్టారు. యాప్‌లను ఆపివేసి, ప్రభుత్వం నిర్ణయించిన కనీస ప్రయాణ ఛార్జీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాప్ కంపెనీలు అధిక కమీషన్లు వసూలు చేస్తూ, ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం వల్ల ఆదాయం తగ్గుతోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలతో కమర్షియల్ రైడ్స్ నిషేధించాలని, ఫేర్ విధానం పారదర్శకంగా ఉండాలని, డిస్కౌంట్ల భారం తగ్గించాలని డ్రైవర్లు కోరుతున్నారు.తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఈ సమ్మెకి పిలుపివ్వగా... సమ్మెకు కారణాలను వెల్లడించింది. డ్రైవర్లకు వచ్చే ఆదాయం చాలా తగ్గిపోయిందని, వారు పేదరికంలోకి వెళ్తున్నారని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. క్యాబ్ కంపెనీలు భారీగా లాభపడుతున్నా, డ్రైవర్లకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ కంపెనీలపై సరైన నిబంధనలు విధించకపోవడం వల్ల డ్రైవర్లు నష్టపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa