ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజీఎస్పీఎఫ్ సిబ్బందికి పోలీసు శాలరీ ప్యాకేజీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 07:53 AM

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా సిబ్బందికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ సంస్థలకు భద్రత కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం  సిబ్బందికి కూడా పోలీసు శాలరీ ప్యాకేజీని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో శనివారం టీజీఎస్పీఎఫ్, ఎస్బీఐ మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం  జరిగింది.ఈ ఒప్పందం ప్రకారం టీజీఎస్పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ. కోటి అందుతుంది. అదే విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. కోటీ 60 లక్షలు చెల్లిస్తారు. విధి నిర్వహణలో శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. 80 లక్షల వరకు పరిహారం అందిస్తారు. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది పిల్లల ఉన్నత విద్య కోసం రూ. 28 లక్షల వరకు, ఇద్దరు కుమార్తెల వివాహాల కోసం రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.వీటితో పాటు రూ. 10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. కాలిన గాయాల కేసుల్లో ప్లాస్టిక్ సర్జరీకి గరిష్ఠంగా రూ. 10 లక్షలు, అంబులెన్స్ ఖర్చులకు రూ. 50 వేలు, ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 10 లక్షల వరకు చెల్లిస్తారు. ఈ ఒప్పందం ద్వారా సిబ్బందికి పలు రుణ సౌకర్యాలు, లాకర్ అద్దెపై రాయితీలు, ప్లాటినం రూపే డెబిట్ కార్డు వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa