కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శ్రీపతి ఉదయ్ కుమార్ అనే పేద విద్యార్థి మైక్రోబయాలజీ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించి, ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే అవకాశం పొందాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడటంతో, ఎమ్మెల్యే కె. పీ. వివేకానందను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు లయన్స్ క్లబ్ సభ్యులు సోమవారం రూ. 1,30,000 ఆర్థిక సహాయాన్ని విద్యార్థికి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa