ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదనపు కలెక్టర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 06:54 PM

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి నాయకులకు కార్యకర్తలుగా మారి ఎన్నికల్లో పనిచేస్తామని హామీలు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై గురువారం ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజను కలిసి ఫిర్యాదు అందజేశారు. సంబంధిత ఉద్యోగులపై వెంటనే సస్పెన్షన్ తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa