ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్ని ప్ర‌మాదాల‌పై పాతబస్తీలో హైడ్రా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 10:46 AM

నిప్పుతో ఊహించ‌ని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల స‌మ‌యంలో మంట‌లు వ్యాపించే ప‌రిస్థితి ఉంది. వ‌చ్చేది వేస‌వి కాలం.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అగ్ని ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అగ్ని మాప‌క నిబంధ‌న‌ల‌న్నీ తూచా త‌ప్ప‌కుండా అంద‌రూ పాటించాలి. వ‌చ్చేది వేస‌వి కాలం.. మ‌రింత ప్ర‌మాదం పొంచి ఉంది. న‌గ‌రంలో జ‌రిగిన అనేక అగ్ని ప్ర‌మాదాల‌ను ప‌రిశీలిస్తే నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అందుకే హైడ్రా అగ్ని ప్ర‌మాదాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను పెద్ద యెత్తున చేస్తూ వ‌స్తోంది.. `` అని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు.  అగ్ని ప్ర‌మాదాల‌పై పాత‌బ‌స్తీలో గురువారం నిర్వ‌హించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యూ శ్రీ జుల్ఫీక‌ర్ తో క‌లిసి హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు  పాల్గొని ప్ర‌సంగించారు. త‌ర‌చూ జ‌రుగుతున్న అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి నెలాఖ‌రులో త‌నిఖీలు చేప‌ట్టి 9 షాపుల‌ను సీజ్ చేసిన‌ట్టు గుర్తు చేశారు. ప‌లు వ్యాపార సంఘాల విన‌తుల మేర‌కు ఒక నెల రోజులు స‌మ‌యం ఇచ్చామ‌ని.. మార్చి నెల రెండో వారం నుంచి త‌నిఖీలు ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఆయా వ్యాపార స‌ముదాయాల‌ను, షాపుల‌ను సీజ్ చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు హెచ్చ‌రించారు. 


 అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో హైడ్రా త‌నిఖీలు చేయ‌డం.. నిబంధ‌న‌లు పాటించ‌క‌ని వ్యాపార సుముదాయాల‌ను సీజ్ చేయడాన్ని వేధించ‌డంగా భావించ‌వ‌ద్ద‌ని.. జాగ్ర‌త్త ప‌డ‌డంగా ప‌రిగ‌ణించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు అన్నారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని వ్యాపార‌ సంఘాల ప్ర‌తినిధులతో పాటు.. పౌరుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు హైడ్రా పెద్ద పీట వేస్తుంద‌న్నారు. వ్యాపారాలు ప్ర‌శాంతంగా చేసుకోండి.. జాగ్ర‌త్త‌లు పాటించండి.. మీతో పాటు.. మీ విలువైన వినియోగ‌దారుల భ‌ద్ర‌త గురించి ఆలోచించండి అని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదాల వీడియోలు, రెస్క్యూ ఆప‌రేష‌న్లు, అగ్ని ప్ర‌మాదాల‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.  అగ్ని ప్రమాదాలకు ఎవరు బాధ్యులు అనేది గ్రహించాలని చార్మినార్ MLA జల్ఫికర్ గారు అన్నారు. ప్రమాదాలు జరగక ముందే అప్రమత్తమవ్వాలని సూచించారు. రంజాన్ మాసం వ్యాపారాలు జరుగుతాయి స్టాకును భద్రపరిచినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికి వారు చెక్ చేసుకోవాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య గారు ఆర్ఎఫ్వో శ్రీ జయప్రకాష్ గారు, DFOలు యజ్ఞ నారాయణ గారు, వెంకన్నగారు, విద్యుత్ విభాగం అధికారి ఏవీ రామారావు గారు, సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారితో పలు విభాగాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa