ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణాలో ఉనికి చాటుకున్న టీడీపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 11:51 AM

మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి.మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 చోట్ల విజయం సాధించారు.ఇప్పటి వరకు పలు మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. అశ్వారావుపేట, పెద్దపల్లి, కామారెడ్డి, భీంగల్, మరిపెడ, చండూరు, చొప్పదండి, రామాయంపేట, బాన్సువాడ, హాలియాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేటలో 22 వార్డులకు గాను 17 స్థానాల్లో కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్, ఒకచోట బీజేపీ విజయం సాధించాయి. హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa