మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయం జనసేన శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది.పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపుకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa