ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 06:24 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ప్రజలు ప్రజా పాలనకు పట్టం కట్టారని, ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసమే ఈ ఆదరణకు కారణమని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు.మధిర మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టుబట్టి ఓవైపు పార్టీ శ్రేణులను కదిలించారు, పోరాట స్ఫూర్తిని నింపారు. మరోవైపు రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా మధిర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఓటర్లకు తానే స్వయంగా వివరించి వారి మనసు గెలిచి ఘన విజయం సాధించారు. అన్ని తానై ముందుకు నడిచిన భట్టి విక్రమార్క తిరుగులేని ప్రజా నాయకుడని తాను ఓ క్యాడర్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నారు. భట్టి విక్రమార్క ఏ పని చేసిన పద్ధతి ప్రకారం చేస్తారు.. ఫలితం సాధిస్తారని మరోసారి స్పష్టమైంది. గత పది సంవత్సరాలు మన పార్టీ అధికారంలో లేదు, మున్సిపాలిటీ కూడా మన చేతిలో లేదు ఆ పార్టీ అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఈ సమయంలో మధిర ఎమ్మెల్యేగా మున్సిపాలిటీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించడం సాధ్యం కానీ పని అని విజ్ఞుడైన, ప్రజాస్వామ్యవాది భట్టి విక్రమార్క మౌనంగా భరించారు. తిరిగి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిప్యూటీ సీఎంగా ఆర్థిక, విద్యుత్తు మరియు ప్రణాళికా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేతికి వచ్చాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa