ములుగు మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 20 వార్డులకు గాను 12 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది ప్రజల ఆకాంక్షల విజయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa