ట్రెండింగ్
Epaper    English    தமிழ்

MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మాద్రి పృథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 07:08 PM

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరుల సౌకర్యార్థం MDR ఫౌండేషన్ ప్రత్యేక రంజాన్ క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ప్రతి రోజుకు సంబంధించిన సహార్ (ఉపవాస ప్రారంభం) మరియు ఇఫ్తార్ (ఉపవాస విరమణ) సమయాలను స్పష్టంగా పొందుపరచడం ద్వారా ఉపవాసాలు సక్రమంగా పాటించేందుకు సహాయపడే విధంగా రూపొందించారు.శుక్రవారం, పటాన్‌చెరు పట్టణంలోని పృథ్వీరాజ్ గారి కార్యాలయంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముస్లిం సోదరులతో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా, పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమం, దాతృత్వానికి ప్రతీక. సమాజంలో ఐక్యత, శాంతి, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు మా వంతు ప్రయత్నంగా ఈ క్యాలెండర్‌ను అందిస్తున్నాం అని తెలిపారు.ఈ సందర్భంలో, ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, భక్తిని నింపాలని ఆకాంక్షించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa