కొత్తగూడెం ఎన్నికల ఫలితాలపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆదిభట్ల సర్కిల్ కార్యదర్శి అనంతుల కాటంరాజు గౌడ్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓ. యాదయ్య మాట్లాడుతూ, కమ్యూనిస్టులు లేరనే వారికి కొత్తగూడెం ఫలితాలే సమాధానమని, పేదరికం పోవాలంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనురాధ, విజయ, కే. శివ, నాగేశ్వర్, శ్రీకాంత్, నీలా, కొట్యా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సంబరాలు రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ హాట్ బాటిల్ సర్కిల్‌లో జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa