ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటైన్స్ డే ఆఫర్స్.. పోలీసుల హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 02:10 PM

వాలంటైన్స్ డే ఆఫర్లు, గిఫ్ట్ డెలివరీల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకుల పట్ల హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది రొమాన్స్, మ్యాట్రిమోనీ మోసాల ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.12.65 కోట్లు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లలో ఓటీపీలు, వ్యక్తిగత ఫోటోలు పంపవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. 'బీ అలర్ట్ బాసూ' అనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa