ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు వారాల్లో MPTC, ZPTC ఎన్నికలు.. నేడు నిర్ణయం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 03:18 PM

TG: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇక ఇదే ఊపులో ఎంపీటీసీ, ZPTC ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. అలాగే పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారని సమాచారం. మరో రెండు వారాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారని టాక్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa