ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీలకు 70 శాతం పదవులను కేటాయించాలి: జాజుల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 03:59 PM

మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికల నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 16న జరగబోయే ఎన్నికల్లో బీసీలకు 70% పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో గెలిచిన బీసీలను కాదని ఓసీని చైర్మన్ చేయాలని చూస్తున్నారని, దీనిని సహించబోమని అన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించని పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని, వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. విజయం సాధించిన బీసీ అభ్యర్థులు అగ్రవర్ణాలకు మద్దతు తెలపవద్దని, బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa