ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదం.. మినీ ఆటో బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 04:05 PM

శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రాజీవ్ రహదారిపై ఆంధ్ర నుంచి కొబ్బరి బొండాలతో వస్తున్న మినీ ఆటో బోల్తా పడింది. టీజీ 27 టి 0524 గల మినీ వ్యాన్ ఎల్ఎండి వద్ద ఎక్సెల్ విరిగిపోవడంతో అదుపుతప్పి డివైడర్ దాటి హైదరాబాద్ వైపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ రాజుకు గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు నిత్యం రద్దీగా ఉండే రహదారిపై జరిగిన ఈ ప్రమాదం కారణంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. రహదారి నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa