ఎముకమజ్జ మార్పిడి చికిత్స పొందుతున్న రాజీవ్ గాంధీ నగర్, బాచుపల్లి నివాసి శ్రీ బి. ఆనంద్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 3.25 లక్షల ఎల్‌ఓసి చెక్కును ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం ఎదురు చూసేవారు ఎల్ఓసి విధానాన్ని దరఖాస్తు చేసుకొని చికిత్స పొందాలన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యుడు సతీష్, మాజీ కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, సుజాత, శెనిగల ప్రమీల యాదవ్, పార్టీ నాయకులు సాంబశివ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, దుండిగల్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.