ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గులాబీ గూటికి జిన్నారం మున్సిపల్ స్వతంత్ర అభ్యర్థి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 10:30 AM

పటాన్చెరు  : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థులు సైతం గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన శిల్పా నాగరాజు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.  ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ  శంబిపూర్ రాజుల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వతంత్ర అభ్యర్థులు సైతం బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని తెలిపారు. ఇందుకు సంపూర్ణ సహకారం అందించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు.. పూర్తి విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్, కృష్ణ, గోవింద్, మచ్చేందర్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa