ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహ ముహూర్తాలు: 53 రోజులే శుభ ఘడియలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 12:20 PM

మాఘమాసం ముగియడంతో పాటు శుక్రమూఢం కూడా పరిసమాప్తం అవుతోంది. ఈ నెల 17న అమావాస్యతో శుక్రమూఢం ముగిసి, ఫాల్గుణ మాసం 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫాల్గుణ శుద్ధ విధియ, అనగా 19వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభమై ఏడాది పొడవునా కొనసాగుతాయి. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీలలో, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలలో, ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలలో, మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలలో, జూన్‌లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీలలో, జూలైలో 1, 6, 7, 11 తేదీలలో, నవంబర్‌లో 21, 24, 25, 26 తేదీలలో, డిసెంబర్‌లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలలో వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలున్నాయని పంచాంగకర్తలు తెలిపారు. 2026లో కేవలం 53 రోజులు మాత్రమే శుభ ముహూర్తాలు ఉండటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa