ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన నైట్ క్రికెట్ టోర్నమెంట్లలో మాద్రి పృథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 04:03 PM

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణంలో KBN యంగ్ స్టార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మహా శివరాత్రి నైట్ క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 2” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాద్రి పృథ్వీరాజ్ గారు టోర్నమెంట్‌ను ప్రారంభించారు.అదే విధంగా, ముత్తంగి క్రీడా మైదానంలో రాహుల్ మరియు టిల్లు ఆధ్వర్యంలో నిర్వహించిన “ముత్తంగి ప్రీమియర్ లీగ్ – మహా శివరాత్రి నైట్ క్రికెట్ టోర్నమెంట్” కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, శివరాత్రి జాగరణ అనేది కేవలం భక్తి పరిమితిలోనే కాకుండా, ఐక్యత, క్రమశిక్షణ మరియు సానుకూల కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ద్వారా సమాజంలో మంచి మార్పులకు దోహదపడుతుందని పేర్కొన్నారు. యువత తమ సమయాన్ని సృజనాత్మక కార్యక్రమాలకు వినియోగిస్తూ, ఆరోగ్యకరమైన క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.ఈ టోర్నమెంట్ యువతకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా నిలిచి, సమాజంలో స్నేహభావం, ఐక్యత మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa