ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే నవీన్​ యాదవ్​ కీలక వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 12:20 PM

హుజూరాబాద్​ మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించడాన్ని పురస్కరించుకుని, రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్​ జెండానే ఎగురుతుందని జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే నవీన్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం యూసఫ్​గూడలోని తన కార్యాలయంలో ఆయనను నాయకులు సన్మానించారు. హుజూరాబాద్​లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్​ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించామని, బీఆర్​ఎస్​కు ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ 16 వార్డుల్లో విజయం సాధించగా, బీఆర్​ఎస్​ 8 వార్డులు గెలుచుకుందని, రానున్న గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa