బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మంచిర్యాల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆయనకు జ్యూడిషయల్ రిమాండ్ విధించారు. ఈ మేరకు మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా బాల్క సుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు మంచిర్యాల జిల్లా బంద్ కు BRS పిలుపునిచ్చింది.ఈ కేసులో బాల్క సుమన్‌ను A1గా, మూల రాజిరెడ్డిని A2గా, అనిల్‌ను A3గా పోలీసులు పేర్కొన్నారు. BNSలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో చట్టవిరుద్ధంగా గుమికూడడం (BNS 189(3)), అల్లర్లు (191(2)), మారణాయుధాలతో అల్లర్లు (191(3)), ఆయుధాలతో గాయపరచడం (118(1)), ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం (324(5)), అలాగే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం (223 r/w 190) వంటి సెక్షన్లు ఉన్నాయి.అరెస్టు అనంతరం బాల్క సుమన్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి భద్రతను కట్టుదిట్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa