ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌తో సైనిక చర్యకు దిగేందుకు సిద్దమౌతున్న అమెరికా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 05:31 PM

ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్తున మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్' ఈ వారాంతంలోగా ఆ ప్రాంతానికి చేరుకోనుంది. దీనికి తోడు యూకే నుంచి యుద్ధ విమానాలు, రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు కూడా ఇరాన్‌కు సమీపంలో మోహరించాయి. ఒకవేళ దాడులు జరిగితే, ఇజ్రాయెల్‌తో కలిసి కొన్ని వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇరాన్ అణు కార్యక్రమాలపై మంగళవారం జెనీవాలో జరిగిన పరోక్ష చర్చలు సఫలం కాలేదు. అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, ఇరాన్ దానికి అంగీకరించలేదు. "దౌత్యానికే మా మొదటి ప్రాధాన్యం, కానీ అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోం" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa