ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివసేన పత్రికలో వచ్చిన అంశంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 05:35 PM

శివసేన (యూబీటీ)కి చెందిన పత్రిక 'సామ్నా'లో వచ్చిన కథనంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు అవసరమని ‘సామ్నా’ పత్రికలో కథనం వచ్చిందని... ఆ కూటమి విచ్ఛిన్నమవుతుందనే విషయాన్ని సదరు కథనం స్పష్టంగా చెబుతోందని రాంచందర్ రావు అన్నారు. ఇవాళ ఉదయం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోని టీఎంసీ, డీఎంకే వంటి చిన్న పార్టీలు సైతం కూటమి నాయకత్వ మార్పును కోరుతున్నాయని... ప్రస్తుత నాయకత్వంపై భాగస్వామ్య పక్షాలకు నమ్మకం పోయిందనే విషయం దీంతో క్లియర్‌గా అర్థం అవుతోందని అన్నారు. కూటమిలో భాగంగా ఉన్న పార్టీ యూబీటీకి చెందిన ‘సామ్నా’ పత్రికే సొంత కూటమి గురించి ఇలాంటి కథనాన్ని ప్రచురించడం కూటమిలోని అంతర్గత విభేదాలను బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa