ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడియం శ్రీహరి వ్యాఖ్యలపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:08 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన విమర్శల పట్ల జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పై కడియం శ్రీహరి చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యలంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, కేసీఆర్‌లను మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు. ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి పంచన చేరారని మండిపడ్డారు.ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదమని, ఊసరవెల్లి సిగ్గుపడేలా... నమ్ముకున్న వారిని అందరినీ మోసం చేస్తూ వస్తున్న వ్యక్తి అని ఆరోపించారు. కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చి ఎంపీని, ఎమ్మెల్సీని, మంత్రిని చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఆయనకు అన్ని రకాలుగా పదవులు ఇచ్చి కేసీఆర్ రాజకీయ పునర్జీవం ప్రసాదించారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa