ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవన్ రెడ్డికి పార్టీ న్యాయం చెయ్యాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 03:58 PM

జగిత్యాలలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి రాజకీయంగా ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీలోనే కొనసాగారని, అలాంటి నాయకుడికి పార్టీలో అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా టిక్కెట్లు ఇచ్చి పార్టీ ఆయనను ప్రోత్సహించిందని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆయన ఓడిపోయారని అన్నారు. కానీ ఆయన ఎప్పుడూ పార్టీ గీతను దాటలేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతానని అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరగకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అధిష్ఠానం చొరవ తీసుకోవాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa