ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎంశ్రీ స్కూళ్లలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:15 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపికైన 16 పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, అదనపు తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇంకుడు గుంతలు వంటి నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa