తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. మార్చి నెలాఖరులోగా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ యాప్ ద్వారా పనులను పర్యవేక్షిస్తూ, విడతల వారీగా నిధులను విడుదల చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ గృహవసతి కల్పించడంలో ఈ యాప్ కీలక భూమిక పోషిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa