ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా పరిషత్ హై స్కూల్ ని తనిఖీ చేసిన కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 04:06 PM

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బిచ్ మహాల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల హాజరు, వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్ లో ప్రశ్నలు అడిగి, రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఫార్ములాలు చదవాలని, పరీక్షలకు 20 రోజులే సమయం ఉందని, బాగా చదవాలని సూచించారు. సెలవుల్లో వాగుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa