కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన చర్చి పాస్టర్ ఉప్పెల్లి సత్యంబాబు (54) అక్కడికక్కడే మృతి చెందారు. రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa