సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో మంగళవారం రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సహస్ర కలశ స్థాపన, హోమ పూజలు, పుష్పార్చణ వంటి కార్యక్రమాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa